46676e8e-fcac-4ece-b205-3e3a75492134-1.jpg

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

d466e7f0-aa3b-4076-90db-ba1c215f4db0-2.jpg

కిడ్నీ ఆరోగ్యానికి కీలకమైన ఎలక్ట్రోలైట్ సమతౌల్యం కోసం పోషకాహారం తీసుకోవాలి

4820a6c6-9dc6-421f-b86f-5c2a7abfa6e1-3.jpg

ఉప్పు తక్కువగా తీసుకోవాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉండి కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది.

80a8fe2d-006b-48f9-81db-3501c57a7af3-4.jpg

నీరు తగినంత తాగడం కిడ్నీ ఆరోగ్యానికి కీలకం. బాగా నీరు తాగితే ఒంట్లోని మలినాలు, విషతుల్యాలు తొలగిపోతాయి.  

డయాబెటిస్ అదుపులో లేకపోతే రక్తంలోని చక్కెరలను ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలు మరింతగా శ్రమ పడాల్సి వస్తుంది.

మద్యం అలవాటు ప్రమాదకరం. ఆల్కహాల్‌ను కాలేయం ఇతర రసాయనాలుగా మారుస్తుంది. ఇవి శరీరానికి మరింత హానికరం

సోడియం, ఫాస్ఫరస్, చక్కెరలు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో కిడ్నీలకు అపాయం. కాబట్టి, వీటి జోలికెళ్లొద్దు.

రోజూ రాత్రిళ్లు తగినంత నిద్రపోతే మెదడుతో పాటు కిడ్నీలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి.

బీపీపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. హైబీపీతో కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది

సొంత వైద్యం కూడా కిడ్నీలకు చేటు చేస్తుంది. డాక్టర్ల సలహా మేరకే మందులు తీసుకోవాలి.