కొన్ని ఆకుకూరలు, కూరగాయలు పచ్చిగా తింటేనే బెటర్ అని అనుభవజ్ఞులు చెబుతున్నారు

కొద్దిపాటి తీపితో కరకరలాడే కారెట్స్ పచ్చిగానే తినేందుకు అనువైనవి

వీటిల్లోని విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

సలాడ్స్‌లో వేసుకోవడంతో పాటు పచ్చిగా తినేందుకు కీరదోస కూడా అనువైనదే

యాంటీఆక్సిడెంట్స్, నీరు పుష్కలంగా ఉన్న కీరదోసతో చర్మ ఆరోగ్యం రెండింతలవుతుంది

క్యాప్సికమ్‌ను కూడా పచ్చిగానే సలాడ్స్ లేదా శాండ్‌విచ్‌లకు జోడించొచ్చు

ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

సలాడ్స్, స్మూదీల్లో వేసుకుని తినేందుకు పాలకూర మంచిది

ఇందులో ఉండే ఐరన్, శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

కరకరలాడే సెలరీ ఆకులు కూడా డిప్స్ లేదా సలాడ్స్‌లో వేసుకోవచ్చు

పీచు పదార్థం పుష్కలంగా ఉండే సెలరీ జీర్ణవ్యవస్థకు మేలు చేసి మలబద్ధాకన్ని తొలగిస్తుంది