చెరకు రసంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

చెరకులో ఉండే చక్కెరల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది

చెరకు రసంలోని యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఇతర ఎలక్ట్రొలైట్స్ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి.

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని పొటాషియం కడుపులో పీహెచ్ స్థాయిలను సమతులీకరిస్తుంది

ఇందులోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి

కామెర్లు వచ్చిన వారికి చెరకు రసం ఉపయోగకరమని కూడా నిపుణులు చెబుతున్నారు

ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి మేలు చేకూరుస్తాయి.