మీకు ఎప్పుడూ అవసరమయ్యే చిట్టి చిట్కాలు.. చూసేయండి.. చేసేయండి..

 ఒత్తిడి వేధిస్తుంటే..

యాలకులు నమలడం  లేదా వాటితో టీ చేసుకొని  తాగాలి. దీంతో మెదడులోని  హార్మోన్ల విడుదల సమమై  ఒత్తిడి అదుపులోకొస్తుంది.

లో బీపీ..

8 బాదం పప్పులను రాత్రంతా  నానబెట్టి మరుసటి ఉదయం  తోలు తీసి మెత్తగా పేస్ట్‌లా  తయారుచేసి, ఆ ముద్దను  పాలల్లో కలుపుకుని తాగాలి.

కంటి నిద్ర..

రాత్రి నిద్రకు 3 నుంచి 4 గంటల ముందు  వరకూ పొట్టను ఖాళీగా ఉంచుకుంటే,  గ్రోత్‌ హార్మోన్‌ వృద్ధి అవుతుంది. కొవ్వు  కరుగుతుంది. పొట్ట చదును అవుతుంది.

 అలసట

ఉదయం నిద్రలేవగానే  అలసటగా ఉంటే పొటాషియం  లోపం ఉందని అర్థం. అరటి పండు,  కొబ్బరినీళ్లు ఈ సమస్యకు విరుగుడు.

 తలనొప్పి తరుచూ ఉంటే..

తలనొప్పి తరచూ వేధిస్తుంటే, సోడియం  లోపంగా భావించవచ్చు. కీర దోస రసం  సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది.

ఖర్జూరాతో ఎంత మేలో..!

రోజుకు మూడు ఖర్జూరాలు  తింటే, జీర్ణశక్తి పెరిగి, శక్తి  నిల్వలు వృద్ధి అవుతాయి.  మెదడు చురుగ్గా మారుతుంది.  ఎముకలు బలపడతాయి.

నిద్ర రావట్లేదా..?

 నిద్ర పట్టకపోతే మెగ్నీషియం  తగ్గిందని అర్థం. కాబట్టి  మెగ్నీషియం ఎక్కువగా ఉండే  పాలకూర, అవకాడోలు తినాలి.