ఈ 6 ఫుడ్స్‌తో.. దంతాల సమస్యకు చెక్
నోరు శుభ్రంగా లేకపోతే.. దంత క్షయం, చిగుళ్ల సమస్యలతో పాటు గుండె సమస్యలు, డయాబెటిస్ ముప్పు పెరిగే అవకాశం ఉంది.
ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే.. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు మీ డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరం.
పాల ఉత్పత్తులు: వీటిల్లో ఉండే కాల్షియం, ఫాస్పరస్.. దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేసిన దంతాల్ని ధృడంగా మార్చుతాయి.
పండ్లు: యాపిల్స్, జామ, క్యారెట్ వంటివి.. దంత క్షయానికి దారితీసే బ్యాక్టీరియాను తొలగించి, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గ్రీన్ టీ: ఇందులోని కాటెచిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు.. చిగుళ్ల వ్యాధిని నివారించడానికి తోడ్పడతాయి.
నట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌లో కాల్షియం, ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి.
ఆకుకూరలు: పాలకూర, కాలే వంటి వాటిల్లో ఉండే విటమిన్లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్.. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఫ్యాటీ ఫిష్: ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, చిగుళ్ల ఆరోగ్యానికి సహాయపడతాయి.
Related Web Stories
విటమిన్ కే-2 వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
వేసవిలో కూల్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు ఆ జోలికే పోరు..!
ఈ ఒక్క దుంప వల్ల.. ఎన్ని ఆరోగ్య ఉన్నాయో తెలుసా..