అన్నం పరబ్రహ్మ స్వరూపమే. కానీ తరచుగా తింటే శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. ఈ హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే బెటర్.
హోల్ గ్రెయిన్స్: అన్నం బదులు వీటిలో ఏవైనా తీసుకుని వండుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి.. ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
క్యాబేజీ: క్యాబేజీని సలాడ్‌లా తింటే ఎంతో మంచిది. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. వీటిని తింటే.. చెడు కొవ్వుతో పాటు శరీర బరువు తగ్గుతుంది.
బ్రోకలీ రైస్: క్యాలీఫ్లవర్ తరహాలోనే బ్రోకలీని అన్నంలా వండొచ్చు. వీటిలో కేలీరలు తక్కువ, పోషకాలు ఎక్కువ. కాబట్టి.. ఇవి తింటే శరీర బరువు తగ్గుతుంది.
బంగాళాదుంప: చైనీస్ వీటిని కార్బోహైడ్రేట్స్‌కి ప్రత్యామ్నాయంగా బియ్యంలా వాడతారు. ఫైబర్ ఎక్కువగా ఉంటే దీనిని తరచుగా తింటే.. శరీర బరువు అస్సలు పెరగదు.
కాలీఫ్లవర్ రైస్: ఇది తినడానికి, చూడ్డానికి అన్నంలానే ఉంటుంది. కాలీఫ్లవర్‌ని తురిమి ఓ పలుచని గుడ్డలో ఆవిరి మీద ఉడికిస్తే క్యాలీఫ్లవర్ రైస్ తయారవుతుంది.
క్వినోవా: ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇవి కూడా బియ్యానికి ప్రత్యామ్నాయం. ఇందులో ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
బార్లీ: ఇవి బియ్యానికి సమానమైన రుచిని కలిగి ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువ. కిడ్నీ నుండి బరువు తగ్గేదాకా.. ఎన్నో సమస్యలు దూరమవుతాయి.