మెరిసే చర్మం కోసం తినాల్సిన 7 ఆహారాలు ఇవే..

మెరిసే చర్మానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముందుగా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు కలిగి ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. 

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు, ఆరోగ్యకరమైన చర్మానికి సహకరిస్తాయి.

గింజలు, విత్తనాల్లో చర్మాన్ని రక్షించే పోషకాలు, కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఇ ఉన్నాయి.

స్వీట్ పొటాటోస్ వీటిలో చర్మాన్ని ఎండ నుంచి రభించే పోషకాలున్నాయి. ఇది చర్మానికి మెరుపునిస్తుంది.

టమోటాలు లైకోపీన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, చర్మాన్ని ఎండ దెబ్బతగలకుండా కాపాడేందుకు సహకరిస్తాయి.

గ్రీన్ టీ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మ తీరును బట్టి మెరిసేలా చేస్తుంది.

సాల్మన్ చేపలలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహకరిస్తాయి.