దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..  ఈ 7 ఫుడ్స్ తినాల్సిందే!

దంతాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే.. దంత క్షయం, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తకారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

నోరు ఆరోగ్యంగా, శుభ్రంగా లేకపోతే.. గుండె సమస్యలు, డయాబెటిస్‌, శ్వాసకోస ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

అందుకే.. నోటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. అందుకు.. మీ డైట్‌లో ఈ 7 రకాల ఫుడ్స్ తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి.

పండ్లు, కూరగాయలు: యాపిల్స్‌, జామ, క్యారెట్‌, సెలెరీ వంటివి లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దంత క్షయానికి దారితీసే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

గ్రీన్‌ టీ: ఇందులో కాటెచిన్స్ ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు చిగుళ్ల వ్యాధిని నివారించడానికి తోడ్పడతాయి.

నట్స్‌: బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌లో కాల్షియం, ప్రొటీన్స్‌ ఉంటాయి. ఇవి దంతాలను బలోపేతం చేసి, చిగుళ్ల వ్యాధిని నిరోధిస్తాయి.

ఆకుకూరలు: పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్లు, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చిగుళ్లను ప్రోత్సాహిస్తాయి.

ఫ్యాటీ ఫిష్‌: సాల్మన్‌, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, చిగుళ్ల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

క్రాన్బెర్రీస్: ఇందులోని సమ్మేళనాలు నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడానికి తోడ్పడతాయి. దంత క్షయం, చిగుళ్ల సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తాయి.