0af9b137-4a2f-41d3-b2af-47bec594d097-teeth_11zon.jpg

దంతాలు తెల్లగా మెరిసేలా చేసే 8  ఆహారాలు, పానీయాలు..

ఆరోగ్యకరమైన చిరునవ్వును సొంతం చేసుకోవాలంటే అది ఆహారంతోనే సాధ్యం. దంతాలు, చిగుళ్ళను సహజంగా రక్షించడంలో సహాయపడే 8 ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

చీజ్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది నోటిలో ఆమ్లతను తగ్గిస్తుంది. ఎనామిల్‌ను బలోపేతం చేయడానికి, దంత క్షయం తగ్గించడానికి సహాయపడుతుంది.

పాలకూర, బ్రకోలీ ఇతర ఆకుకూరలలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. చిగుళ్ళు, మొత్తం నోటి ఆరోగ్యానికి చాలా మంచివి.

యాపిల్స్ దంతాలను శుద్ధి చేసి లాలాజలాన్ని ప్రేరేపిస్తాయి. నోటిలో ఇరుక్కున్నఆహార కణాలు, బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

పచ్చి క్యారెట్లలో ఫైబర్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. అవి లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన చిగుళ్ళ కోసం వీటిని తరచూ తినండి.

పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి చెడు బ్యాక్టీరియాతో పోరాడటానికి, దంతాలు, చిగుళ్ళను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

బాదం, జీడిపప్పు అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. లాలాజలాన్ని ప్రేరేపిస్తాయి. ఇవి సహజంగా దంతాలను శుభ్రపరుస్తాయి. 

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించి  నోటిని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

నీరు తాగడం వల్ల నోట్లోని ఆహార అవశేషాలు తొలగిపోతాయి.  నోటిని హైడ్రేట్ గా ఉంచుతాయి. లాలాజల ఉత్పత్తిని, pH స్థాయిలను ప్రోత్సహిస్తాయి.