ఆరోగ్యం బాగోలేదా.. ఈ 8 ఫుడ్స్ తింటే వెంటనే కోలుకుంటారు
జలుబు, జర్వం వచ్చినప్పుడు నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ 8 ఆహారాలు తింటే, త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
చికెన్ సూప్: ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్.. త్వరగా కోలుకోవడానికి దోహదం చేస్తాయి.
అల్లం టీ: ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణక్రియకూ తోడ్పడుతుంది.
అరటిపండ్లు్: ఇందులోని విటమిన్ సీ, బి6.. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతిస్తాయి. ఈ పండులోని పోషకాలు.. శరీరానికి శక్తిని అందిస్తాయి.
పెరుగు: ఇందులోని ప్రోబయోటిక్స్.. రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్.. కండరాల మరమ్మత్తుకు తోడ్పడుతుంది.
తేనె: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇది గొంతు నొప్పి, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.
అన్నం: ఇది అన్నం సులభంగా జీర్ణమవుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. అన్నంలోని విటమిన్ బీ.. రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది.
క్యారెట్ సూప్: ఇందులోని బీటా-కెరోటిన్.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సూప్.. రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపచ్చడంలో దోహదపడుతుంది.
సాల్మన్: ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిచ్చి, శరీరానికి శక్తిని అందిస్తాయి.
Related Web Stories
నీళ్లు ఏ టైమ్లో తాగాలి..?
దానిమ్మ ఆకులతో ఇలా చేస్తే.. ఊహించని ప్రయోజనాలు..
వారెవ్వా.. చెరుకు రసంతో ఇన్ని ప్రయోజనాలా..!
ఎండకాలంలో ఈ జ్యూస్ తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది