వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్‌లు తాగితే ఎంతో శ్రేయస్కరం
టమోటా జ్యూస్: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సన్‌బర్న్‌ని తగ్గిస్తాయి. గుండె సమస్యలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
కొంబూచా: ఇది పులియబెట్టిన పానీయం. ఈ డ్రింక్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేడి నుంచి విముక్తి కల్పించడంలోనూ తోడ్పడుతుంది.
నారింజ రసం: వేసవిలో ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇందులోని ఫైబర్ కంటెంట్.. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుందని. గుండె సమస్యలూ తగ్గుతాయి.
క్యారెట్ జ్యూస్: ఇందులో విటమిన్ ఏ, సీలతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ ఎండకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్: ఇందులో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేసి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
గ్రీన్ స్మూతీ: ఈ జ్యూస్ ఉదయాన్నే తాగితే.. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ముఖ్యంగా.. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
కీరదోస రసం: ఇందులో నీటిశాతం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది తాగితే నిత్యం హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. గుండో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
నిమ్మరసం: ఇది తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జ్యూస్ సహాయపడుతుంది.
Related Web Stories
విటమిన్ B12 లోపం కారణంగా శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే..!
విటమిన్-సి బూస్టింగ్ ఆహారాల గురించి తెలుసా?
ఎండాకాలంలో కచ్చితంగా తినాల్సిన 8 కూరగాయలు
మామిడితో కలిగే ఈ లాభాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు