నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఏవంటే..

పార్సిలీ ఆకులలో ఘాటైన వాసన, అధిక క్లోరోఫిల్ కంటెంట్ నోటి దుర్వాసనను తక్షణం తొలగిస్తుంది.

పైనాపిల్ జ్యూస్‌తో కూడా వెంటనే నోటి దుర్వాసన తగ్గుతుంది. జ్యూస్ తాగాక మాత్రం తప్పనిసరిగా నోరు పుక్కిలించాలి.

పాలు కూడా నోటి దుర్వాసన తొలగించేందుకు ఉపకరిస్తాయి

నారింజలో విటమిన్-సి ఉంటుంది. ఈ పండుతో లాలాజలం ఉత్పత్తి పెరిగి నోటి దుర్వాసన తగ్గుతుంది

గ్రీన్‌ టీలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు కూడా ఈ సమస్యను తొలగిస్తాయి.

యాపిల్ పళ్ల తింటే నోటిలోని వెల్లుల్లి వాసన సులభంగా తొలగిపోతుంది

వెనిగర్ మౌత్‌వాష్‌లలో ఆమ్ల లక్షణం ఉంటుంది. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి దుర్వాసనను అరికడుతుంది. 

సొంపుతో కూడా నోటి దుర్వాసన తగ్గుతుందన్నది తెలిసిందే.