స్టామినా బిల్డింగ్ కోసం 8 సూపర్ ఫుడ్స్ ఇవే..

కాస్త నీరసంగా అనిపించినా, కళ్ళు తిరుగుతున్నా, అలసట అనిపించినా వెంటనే శక్తిని ఇచ్చే పదార్థాలను తీసుకోవాలి. 

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. 

ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. రోజంతా శక్తిని విడుదల చేస్తుంది.

పాలకూరలో ఐరన్, నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో ఆక్సిజన్ అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది.

చియా గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్నాయి. 

స్వీట్ పొటాటో విషయానికి వస్తే ఇందులోని బీటా కెరోటిన్ కు గొప్ప మూలం. త్వరగా శక్తిని అందిస్తుంది. కండరాల ఉత్పత్తికి మంచి ఎంపిక.

బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృతులు కలిగి ఉంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండి కండరాల పనితీరును ప్రోత్సహిస్తుంది.

క్వినోవా.. సూపర్ గ్రేయిన్ ప్రోటీన్, ఫైబర్, ఎసెన్షియన్ అమైనో యాసిడ్స్ అధికంగా కలిగి ఉంది. 

గ్రీక్ పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ తో నిండిన ఇది కండరాల పెరుగుదలకు స్థిరమైన శక్తిని అందిస్తుంది.