చంద్రుడి ప్రభావం మనుషుల ఆరోగ్యంపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా మనుషులు నిద్ర వేళల్లో మార్పులు కనిపిస్తాయట.

బైపోలార్ డిజార్డర్ రోగుల్లో చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా మూడ్స్‌లో మార్పులు ఒక్కోసారి పతాకస్థాయికి చేరుతాయట

అమావస్య, పౌర్ణమి రోజుల్లో బీపీ, గుండె కొట్టుకునే తీరు కొద్దిగా నెమ్మదిస్తుందని కూడా అధ్యయనాల్లో తేలింది

పౌర్ణమి చంద్రుడి ప్రభావం ప్రసవాలపై ఉండే అవకాశం ఉందని ఫ్రాన్స్‌లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది.

పౌర్ణమి సందర్భంగా శరీరం మరింత ఉత్తేజితమవుతుందట.

రుతుక్రమంపై చంద్రుడి ప్రభావం కొంత ఉన్నప్పటికీ కృత్రిమ లైట్ల వెలుతురు దీన్ని తగ్గిస్తుందని కూడా శాస్త్రవేత్తలు భావిస్తారు. 

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా భావావేశాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయట.