కీరదోస గింజలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..

కీరదోస గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో ఆరోగ్యం మెరుగవుతుంది.

ఈ గింజల్లో ఫైబర్ అధికం. దీంతో, జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. మలబద్ధకం వంటివి తొలగిపోతాయి.

కీరదోస గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఆరోగ్యకర ఫ్యాటీ ఆసిడ్స్ చర్మం ఆరోగ్యాన్ని ఇనుమడింపచేస్తాయి.

గింజల్లో పీచు పధార్థం అధికంగా ఉండటంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

వీటిల్లోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేసి గుండెకు మేలు చేస్తాయి.

కీరదోస గింజల్లోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠ చేస్తుంది. గాయాలు త్వరగా మానేందుకు తోడ్పడుతుంది.

ఈ గింజల్లో నీరు అధికంగా ఉంటుంది. దీంతో కిడ్నీ పనితీరు మెరుగై విషతుల్యాలు శరీరం నుంచి తొలగిపోతాయి.

వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలు దృఢంగా మారేలా చేస్తాయి. బోలుఎముకల వ్యాధిని తగ్గిస్తాయి

ఈ గింజల వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది