పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ గింజల్లో విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు వంటి పలు అత్యవసర పోషకాలు ఉన్నాయి

వీటిల్లోని విటమిన్ ఈ, అన్‌సాట్యురేటెడ్ కొవ్వులు ఇన్‌ఫ్లమేషన్, చెడు కొలెస్టెరాల్‌ను తగ్గిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి

ఈ గింజల్లో జింక్, సెలీనియం సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

సన్‌ఫ్లవర్ గింజల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఈ మంచి యాంటీఆక్సిడెంట్. దీంతో, చర్మం ఆరోగ్యం ఇనుమడిస్తుంది. 

ఈ గింజల్లోని ప్రొటీన్, ఫైబర్ బరువు నియంత్రణలో ఉంచుకోవడంలో తోడ్పాటునందిస్తాయి.

జీర్ణవ్యవస్థకూ ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. పేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకాన్ని వదిలిస్తాయి

మెగ్నీషియం, ఫాస్ఫరస్‌లు ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలోపేతం చేసి ఓస్టియోపోరోసిస్ వ్యాధి నుంచి రక్షిస్తాయి.

మెదడు పనితీరుకు, భావావేశాల నియంత్రణకూ మెగ్నీషియం కీలకం కాబట్టి సన్‌ఫ్లవర్ గింజలతో మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది

ఈ గింజల్లోని సెలీనియం, విటమిన్-ఈ ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక రోగాలు దరిచేరవు.