చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు..

చెరువుల చేపలు మంచివా, సముద్రపు చేపలు మంచివా అనేది పెద్ద ప్రశ్న

సముద్రపు జలాల్లో చేరుతున్న వ్యర్ధాలు, లోహాల ప్రభావం చేపలపై పడుతోంది.

అలాంటి చేపలు తింటే మన మెదడు సహా వివిధ భాగాలపై ప్రభావం చూపుతాయి.

సముద్రపు జలాల్లో పాదరసం, ఇతర రసాయనాలు ఎక్కువగా కలుస్తున్నాయి.

పాదరసం క్యాన్సర్‌, డయాబెటీస్‌, గుండె సంబంధిత సమస్యలకు ఓ కారణం.

అందుకే గర్భిణులు, పాలిచ్చే తల్లులు సముద్ర జీవులను తినడం తగ్గిస్తే మంచిది.

అయితే చేపల చెరువులూ సముద్ర జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయి.

చెరువుల వర్ధ్యాలు సముద్రంలో కలిసి సముద్రపు చేపలను ప్రభావితం చేస్తున్నాయి.

అందుకే సముద్రపు చేపల కన్నా చెరువుల చేపలు కొంతవరకు మేలని చెప్పొచ్చు

అయితే 50రకాల సముద్రపు చేపలు మంచివిగా నిపుణులు చెబుతున్నారు.

రొయ్యలు, కాడ్‌, మాకెరెల్, సాలమన్‌, హాలిబాట్‌ తినొచ్చంటున్నారు.