మీ కంటి చూపు చురుగ్గా ఉండాలంటే.. సోంపుతో ఇలా చేయండి.. 

ఆయుర్వేదం ప్రకారం.. మీ ఆహారంలో సోంపును చేర్చడం వల్ల కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది.

 పాలలో సోంపు, బాదం, పంచదార మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు ఎంతో బాగుపడుతుంది.

పెసరపప్పు, బాదం పప్పు, పంచదారలో సోంపు కలిపి నిల్వ ఉంచుకోవాలి. రోజూ పాలతో పాటూ తీసుకుంటే కంటికి ఎంతో మేలు.

సోంపు మిశ్రమానికి పసుపు, ఎండు మిర్చి జోడించి తీసుకోవడం వల్ల రుచితో పాటూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సోంపు మిశ్రమం కలిపిన పాలను రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సోంపులో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ, అనెథోల్ సమ్మేళనం.. క‌ళ్లు నీరు కార‌డం, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్-సి, పొటాషియం వంటి పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి మరిగించి, ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా ఎంతో ప్రభావం ఉంటుంది.

సోంపు వాట‌ర్‌ని రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.