30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!
విటమిన్-డి
30ఏళ్ల తర్వాత టెస్టోస్టెరాస్ స్థాయిలు తగ్గుతాయి. ఇది కండర ద్రవ్యరాశిని ప్రభావితం చేస్తుంది. విటమిన్-డి పుష్కలంగా తీసుకుంటే టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచుతుంది.
విటమిన్-బి12
ఎర్రరక్తకణాలు బాగుండాలంటే నాడీవ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. విటమిన్-బి12 నరాల పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది.
విటమిన్-బి6
ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, రోగనిరోధక పనితీరుకు విటమిన్-బి6 అవసరం. ప్రోటీన్ జీవక్రియకు, మొత్తం ఆరోగ్యానికి కూడా ఇది దోహదపడుతుంది.
మెగ్నీషియం
గుండె, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఒత్తిడి తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
జింక్..టెస్టోస్టెరాన్ స్థాయిలు, హార్మోన్ల సమతుల్యతకు జింక్ అవసరం. టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్ గా మారడాన్ని నిరోధిస్తుంది. అంగస్తంభన సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒమెగా-3
గుండె, మెదడు, రక్తనాళాలకు కవచంలా పనిచేస్తుంది. కార్డియోవాస్క్యులర్ ప్రమాదాలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది.
ఫోలెట్
ఫోలెట్ లేదా బి9.. డిఎన్ఎ మరమ్మత్తుకు, కణ విభజనకు అవసరం. కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
విటమిన్-కె
రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి విటమిన్-కె కీలకం. అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడుతుంది. చిత్తవైకల్యం ప్రమాదాలు తగ్గిస్తుంది.