55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!

55ఏళ్ల తర్వాత మహిళల పోషకాల అవసరాలు మారతాయి.  ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరి చేసుకోవాలి.

ఎముకలు దృఢంగా ఉండటానికి ఆహారంలో పాలు,పెరుగు, జున్ను, సోయాబీన్ వంటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

శరీరం కాల్షియంను బాగా గ్రహించాలంటే విటమిన్-డి చాలా అవసరం.  సూర్యకాంతిలో గడపడం, పాలు, గుడ్లు,చేపలలో విటమిన్-డి లభిస్తుంది.

గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, గింజలు తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది.

పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిది.

బాదం, వాల్నట్స్, చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ప్రతి రోజూ 7 నుండి 8 గ్లాసుల  నీరు అవసరం. కాబట్టి తప్పకుండా తీసుకోవాలి.

వయసు పెరిగే కొద్దీ ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, చక్కెర తక్కువగా తీసుకోవాలి.