చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!
ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఎదురయ్యే ఇన్పెక్షన్లు, జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉంటాయి. ఇవి కాలేయ కణాలను రక్షిస్తాయి.
ముల్లంగిని తింటే ఫ్యాటీ లివర్, కామెర్లు, టైఫాయిడ్, వంటి కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
ముల్లంగిలో గ్లూసికోలెంట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరుస్తాయి.
నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల ముల్లంగి తింటే హైడ్రేటెడ్ గా ఉంటారు.
ఫైబర్ మెండుగా ఉండటం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వల్ల ముల్లంగి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ముల్లంగి జ్యూస్ లో మిరియాల పొడి కలుపుకుని తాగితే మొలల సమస్య తగ్గుతుంది.
బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో ఉండటానికి ముల్లంగి సహాయపడుతుంది.