అవకాడోతో ప్రయోజనాలెన్నో 

ఒక అవకాడో ద్వారా 320 కేలరీలు లభిస్తాయి. 28 గ్రాముల కొవ్వు, 17 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 14 గ్రాముల ఫైబర్‌, రెండు గ్రాముల సుగర్‌ లభిస్తాయి. 

అవకాడోలలో సీ,ఈ,కె, బీ6 విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. 

 అవకాడోలలో విటమిన్‌ కె ఉంటుంది. ఇది కాల్షియం శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుంది.

కొలస్ట్రాల్‌ విలువలు పెరగకుండా అవకాడో ఉపకరిస్తుంది. దీని వల్ల హృద్రోగ సమస్యలు తొలగిపోతాయి.

శరీరంలో చక్కెర విలువలు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది.

మెదడు చురుకుగా పనిచేయటంలో ఇది ఉపకరిస్తుంది.

దీనిలో ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.