రోజుకో ఖర్జూరం తింటే..  ఎన్ని లాభాలో తెలుసా?

ఖర్జూరాలు తినడానికి ఎంత రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికీ అంతే మేలు చేస్తాయి. కాబట్టి.. రోజుకో ఖర్జూరం తింటే చాలా మంచిది.

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బీ6, కే ఉంటాయి.

ఖర్జూరాల్లోని ఫైబర్.. జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరిచి, ప్రేగు కదలికల్ని సులభతరం చేస్తుంది. దీంతో.. మలబద్ధకం దూరమవుతుంది.

ఖర్జూరాల్లో కేలరీలు తక్కువగానూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి.. వీటిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఖర్జూరాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఇది సహజమైన తీపిని కలిగి.. చక్కెర స్థాయిలను స్థిరంగా పెంచుతుంది.

ఖర్జూరంలోని పీచు, ఇతర పోషకాలు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇది శరీరంలో కేలరీల్ని తగ్గించి బరువుని కంట్రోల్ చేస్తుంది.

ఖర్జూరాల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. బ్రెయిన్ పనీతీరుని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది.

ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు.. ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.