పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని లాభాలో..!

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ, ఫ్లేవనాయిడ్లు, మంట తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి.

రోగనిరోధక శక్తిని బలోపేతం చెయ్యడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. వీటిలో జింక్, సెలీనియం సహా చాలా వైరస్లతో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయి.

ప్రొద్దుతిరుగుడు గింజలలో ప్రోటీన్లు బోలెడు శక్తిని అందిస్తాయి. విటమిన్-బి, సెలీయం రోజంతా చురుగ్గా ఉంచుతాయి.

విటమిన్-ఈ, విటమిన్-బి1, విటమిన్-బి6, కాపర్, ఐరన్, సెలీనియం, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పొద్దుతిరుగుడు విత్తనాలలోనే లభిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే నియాసిన్, విటమిన్-బి3 కొలెస్ట్రాల్ స్థాయిలు  తగ్గించి గుండె జబ్బులు నివారిస్తాయి.

ఒలేయిక్, లినోలెయిక్ ఆమ్లాలు ఇందులో సమృద్దిగా ఉంటాయి.  సోడియం తక్కువగా ఉంటుంది.   రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే బీటా సిటోస్టెరాల్ , యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ముక్యాన్సర్ సహా చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.  క్యాన్సర్ కణితిలో కణాల పెరుగుదలను అరికడతాయి.

టైప్-2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.

వీటిలో ఉండే విటమిన్-బి6 మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  సెరోటోనిన్, నోర్ పైన్ లను విడుదల చేస్తుంది. తద్వారా మెదడు పనితీరు చురుగ్గా ఉంచుతుంది.