బొప్పాయి ఆకుల జ్యూస్‌తో.. బోలెడన్ని లాభాలు

ఎలాగైతే బొప్పాయితో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. అలాగే బొప్పాయి ఆకులూ ఎంతగానో ఉపయోగపడతాయి.

బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, సీ, ఈ, కే, బీ ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావాల్సిన మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

డెంగీ జ్వరంతో బాధపడేవారు ఈ జ్యూస్ తాగితే మంచిది. ఇది రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిల్ని పెంచి, డెంగీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయి ఆకుల రసం మధుమేహం చికిత్సకు, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి దివ్యౌషధంగా ఉపయోగిస్తారు.

ఈ రసం గ్యాస్ట్రలెన్స్, ఊబకాయం, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.

బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే.. జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచిది. ఇవి చుండ్రు నుంచి సైతం ఉపశమనం కలిగిస్తాయి.

బొప్పాయి ఆకులను నమిలి చర్మానికి రాసుకుంటే.. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు, మొటిమల సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.

బొప్పాయి ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నివారణకు తోడ్పడుతుంది. మలం సాఫీగా వచ్చేలా సహాయపడుతుంది.

బొప్పాయి ఆకుల్లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తుంది కాబట్టి.. చికిత్సల్లో వాడుతారు.