తులసి ఆకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
దశాబ్దాలుగా సంప్రదాయ వైద్య విధానంలో తులసిని ఉపయోగిస్తున్నారు.
ఇందులోని ఔషధగుణాలు కొన్ని రుగ్మతలకు చక్కని విరుగుడుగా పని చేస్తాయి. అవేంటంటే....
తులసితో శరీరంలోని కార్టిసాల్ మోతాదులు తగ్గడంతో ఒత్తిడి అదుపులోకొస్తుంది.
దాంతో నాడీవ్యవస్థ సామర్థ్యం పెరగడంతో పాటు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.
తులసిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి సూక్ష్మజీవులు, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే గుణాలుంటాయి.
కాబట్టి తులసి తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధకశక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
పొట్టలోని ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచే శక్తి తులసికి ఉంటుంది.
కడుపు ఉబ్బరం, అజీర్తిలను తొలగించి జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుంది.
తులసిని క్రమం తప్పక తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులు తగ్గుముఖం పడతాయి.
వంశపారంపర్యంగా మధుమేహం సంక్రమించే అవకాశాలున్న వాళ్లు క్రమం తప్పకుండా తులసిని తింటే, ఈ సమస్య దరి చేరకుండా ఉంటుంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. మొటిమలు తొలగి, చర్మం కాంతివంతంగా మారుతుంది.
తులసి ఆకులను వేడి నీళ్లలో మరిగించి, తేనె కలుపుకుని తాగొచ్చు. సలాడ్స్‌లో కలుపుకుని తినొచ్చు.
Related Web Stories
కొలెస్టెరాల్ తగ్గించేందుకు రాత్రి పూట తాగాల్సిన డ్రింక్స్
మీ ఊపిరితిత్తులు బాగుండాలంటే ఇవి చేయండి
ఈ సమస్యలు ఉన్నవారు టమోటాకు చెక్ పెట్టేయండి.. లేదంటే
మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..