గురక అనేది అందరిలో సర్వ సాధారణమైపోయింది.. కొన్ని టిప్స్ పాటిస్తే తగ్గించుకోవచ్చని చెబుతున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు
గొంతు, నాలుకలోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా గురకను అడ్డుకోవచ్చు. గొంతు, నాలుకకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌తో.. విశ్రాంతి సమయంలో శ్వాసకు అడ్డు రాకుండా ఉంటాయి.
గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా కారణం. కాబట్టి అనారోగ్యకరమైన ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిదంటున్న నిపుణులు
నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య కొంత వరకు తగ్గుతుంది. దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి.
నిద్రించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.. ఆల్కహాల్ కారణంగా గొంతులోని కణాలు రిలాక్స్‌గా మారి.. నాలుక వెనక్కి వెళ్తుంది. ఫలితంగా గురక సమస్య ఉత్పన్నం అవుతుంది.
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగడం వల్ల గురక సమస్య దూరం అవుతుంది.
గోరు వెచ్చగా చేసిన వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేయడం వల్ల గురక తగ్గడంతోపాటు నిద్ర బాగా పడుతుంది
గురుక తగ్గించేందుకు ఉల్లిపాయలు, అల్లం ఎంతో ఉపయోగపడతాయి. రాత్రిళ్లు డిన్నర్‌లో ఉల్లి.. పడుకునే ముందు అల్లం టీ తీసుకుంటే మంచిది
ఆపిల్ పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయ్.. ఇవి తినడం వల్ల బ్లడ్ వెజిల్స్ కార్యకలాపాలు మెరుగుపడి గురుక సమస్య తగ్గుతుందంటున్న వైద్యులు