అలోవెరా జెల్ కూడా నోటి ఇన్ఫెక్షన్లకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ను రోజుకు రెండు సార్లు పూయాలి.
పుసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి నోటిలోపలి పుండ్లను తగ్గిస్తాయి.
లికోరైస్ రూట్.. లైకోరైస్ రూట్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీవైరల్ లక్షణాల కారణంగా నోటిపూతకు ఉపశమనం ఉంటుంది. దీనిని పౌడర్‌గా చేసి నీటితో కలిపి ఆ పేస్ట్‌ని అప్లయ్ చేయాలి.
తేనెలో సహజ యాంటమైక్రోబయల్ గుణాలున్నాయి. నోటిపూతకు తేనె చక్కని పరిష్కారం. దీనిని పుండుపై రోజుకు రెండుసార్లు పూయడం వల్ల ఉపశమనం ఉంటుంది.
బేకింగ్ సోడా పేస్ట్ నోటిలోని పుండ్లపై రోజుకు రెండుసార్లు పూస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
ఉప్పు నీటితో.. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలోని బాక్టీరియావల్ల కలిగే ఇబ్బంది పోతుంది.
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించి, నొప్పినుంచి రిలీఫ్ ఇస్తాయి.