ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? ఈ ఇబ్బందులు రావొచ్చు..!

ప్రోటీన్ ఆరోగ్యానికి మంచిదే అయినా, శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వేధిస్తాయి.

ప్రోటీన్స్‌లోని అమైనో ఆమ్లాలలో నైట్రోజన్ అధికంగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో కిడ్నీ వైఫల్యానికి కారణం కావచ్చు.

కొన్ని ఆహార పదార్థాల ద్వారా లభించే ప్రోటీన్లు కొన్ని రకాల కేన్సర్లకు కారణమవుతాయి.

ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తింటే నోటి దుర్వాసన మొదలవుతుంది.

శరరీంలో ప్రొటీన్ ఎక్కువైతే మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. తగినంత నీరు తాగకపోతే డీ-హైడ్రేషన్ సమస్య మొదలవుతుంది.

ప్రోటీన్ ఓవర్ డోస్ అయితే జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం లేదా డయేరియా వంటి సమస్యలు వేధిస్తాయి.

కేవలం ప్రోటీన్ మీదే దృష్టి పెట్టి కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు తీసుకోకపోతే శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది.