బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు
ఇది గ్యాస్, గుండెలో మంట సమస్యకు దారి తీస్తుందని అంటున్నారు
అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదానికి కారణమవుతుంది.
బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు.. కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర స్థాయిలు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది
దీర్ఘకాలంలో ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.