ఎండాకాలం పీక్ స్టేజీకి చేరుకుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నిపుణులు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు తాగాలని వైద్యులు సిఫార్స్ చేస్తారు. .
చల్లని నీరు తాగడం వల్ల కాస్త రిలీఫ్ అనిపించవచ్చు. వేసవిలో నీటి కొరతను నివారించడానికి ప్రజలు వివిధ డ్రింక్స్ తాగుతారు.
గోరు వెచ్చని నీరు లేదా మట్టి కుండ నీరు తాగాలని సలహా ఇస్తారు. ఇవి మీ ఆరోగ్యానికి హాని కలిగించవు.
ఆయుర్వేదంలో కూడా చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. ఎండల్లో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్‌లోని కూల్ వాటర్ తాగుతారు
నీళ్లు తాగినవేంటనే ఆహారం శరీరంలోకి వెళ్లగానే గట్టిగా మారుతుంది. పేగులు పట్టుకుని ఉంటుంది దీని వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండల్లో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడి ఎదుర్కోని నేరుగా వచ్చి చల్లని లేదా ఐస్ వాటర్ తాగితే మీకు తలనొప్పి రావచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామాలు చేసే వారు కూల్ వాటర్ తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.