శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. మనం ఈ సమస్యని దూరం చేసుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
పాలకూర, తోటకూర, బచ్చలికూర తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వీటితోపాటు గ్రీన్ కలర్‌లో ఉండే బ్రొకోలీ, క్యాప్సికం కూడా హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో సహాయపడతాయి
దానిమ్మ పండు.. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచగలిగే అద్భుతమైన ఫలం. దీని వల్ల బ్లడ్ కౌంట్ ఎక్కువగా పెరుగుతుంది.
షుగర్ పేషెంట్లు రోజూ ఒక ఖర్జూర పండును తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని, హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడుతుంది
ఉసిరికాయ, నిమ్మ వంటివి కూడా హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడతాయి.