బీపీతో బాధపడుతున్నారా..  రోజూ ఎంత ఉప్పు తినాలంటే..

శరీరంలో సోడియం కంటెంట్‌ పెరగడం వల్ల బీపీ ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బీపీ ఉన్న వారు వీలైనంత వరకు ఉప్పును తగ్గించడం మంచిది.

బీపీతో బాధపడేవారు ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండం మంచిది.

కాఫీ, కోలా వంటి కెఫిన్ పానీయాలకు బదులుగా నీరు ఎక్కువగా తీసుకోవాలి.

 మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రోజు తీసుకునే ఆహారంలో సోడియం మొత్తాన్ని కనీసం 1.2 గ్రాములు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.