చలికాలం కీళ్ల నొప్పులు  వేధిస్తున్నాయా..

శీతాకాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకుని హుషారుగా తిరగాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.

సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తినాలి. 

 క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా వంటివి తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

చలికాలంలో తగినంత మంచినీరు తాగడం అశ్రద్ధ చేయకూడదు. 

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వేడి కాపడం వంటివి చేస్తే నొప్పులు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం మంచిది.