భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు

వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి

ఆరోగ్య నిపుణుల కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు

ఇందులో పామాయిల్ కూడా ఉంది

దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు

ఇతర నూనెల ధరలతో పోలిస్తే పామాయిల్ ధర చాలా తక్కువ

అందువల్ల పామాయిల్‌ను ఎక్కువగా వాడుతుంటారు

పరిశోధనల ప్రకారం.. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది

రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు 6 నుండి 13 రకాల రసాయనాలను ఉపయోగిస్తారు

ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడేవారిలో హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి