మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

పాలు, పెరుగుతో మామిడిపండ్లను తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొందరగా వస్తాయి. మామిడిలో ఉండే ఆమ్లం, పాలలో ఉండే ప్రోటీన్లు కలిసి కడుపులో గ్యాస్, అపానవాయువుకు కారణమవుతుంది.

మామిడి పండు తినడానికి ముందు లేదా తర్వాత మద్యం సేవించడం  ప్రమాదం. ఇది ఆహారం జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.

కారంగా ఉన్న ఆహారంతో పాటూ మామిడి పండును తినకూడదు. దీని వల్ల కడుపులో చికాకు, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.

గుడ్లు, మాంసం, పప్పులు వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలతో మామిడిపండు తినకూడదు. జీర్ణక్రియ మందగించి ఉదర సంబంధ సమస్యలు  వస్తాయి.ప్రోటీన్ శోషణకు ఆటంకం కలుగుతుంది.

అరటిపండ్లు, ద్రాక్ష లేదా చెర్రీస్ వంటి ఇతర తీపి పండ్లతో కలిపి మామిడిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.