నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
నెయ్యి పోషకాలకు పవర్ హౌస్. నెయ్యిని రోజూ ఆహారంలో తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి.
నెయ్యి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి సహాయపడుతుంది.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధులతో పోరాడే T కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
నెయ్యి గొప్ప సౌందర్య సాధనం. ఇది చర్మసంబంధ సమస్యలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నెయ్యిలో ఉండే విటమిన్-కె కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచి ఎముకలను బలపరుస్తుంది.