బార్లీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. దీనిని తీసుకుంటే..

బార్లీలో విటమిన్ బి, థయామిన్ ఖనిజాలు, సెలీనియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో పాటు శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లతో అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

బార్లీలో ఫైబర్, బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది.

బార్లీ మలబద్దకాన్ని నివారించడంలో జీర్ణ రుగ్మతలను తగ్గించడంలో సహకరిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తుంది. బార్లీలోని ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. 

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. బార్లీలోని ఫైబర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6 రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి. 

రోగనిరోధక వ్యవస్థ బార్లీతో మెరుగవుతుంది. ఇందులోని సెలీనియం సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది.

ఎముక ఆరోగ్యం బార్లీతో పెరుగుతుంది. ఇందులోని భాస్వరం, మెగ్నీషియం, కాల్షియంతో పాటు అనేక ఖనిజాలు అందుతాయి.