నిమ్మకాయ రసంలో కొన్ని ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసి, వాటిలో పుదీనా ఆకులు కలిపి కొద్దిగా ఉప్పు, స్వీటెనర్ జోడించవచ్చు. మీరు దానిని వడకట్టి, తగినంత చల్లటి నీరు పోసి తాగవచ్చు.
వేసవిలో వేడిని తట్టుకోవడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ నిమ్మరసం చాలా మంచిది.
నిమ్మకాయ రసంలో నాలుగు నుండి ఐదు చిన్న పైనాపిల్ ముక్కలను మీరు బ్లెండర్‌లో వేసి కొద్దిగా నీరు లేదా ఐస్‌తో బ్లెండ్ చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
నిమ్మకాయకు అల్లం జోడించడం ద్వారా మీరు రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కొన్ని నానబెట్టిన చియా విత్తనాలను జోడిస్తే ఇంకా సూపర్‌గా ఉంటుంది.
జీలకర్ర, నిమ్మకాయ వేసి మీరు పానీయం తయారు చేసుకోవచ్చు.
జీలకర్ర, దాల్చిన చెక్క వేసి మరిగించాలి. వేడి అయిన తర్వాత వడకట్టండి. మీరు దానిలో నిమ్మకాయను పిండి తేనెను జోడించండి. ఈ ప్రత్యేక పానీయం కడుపు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.