జాగ్రత్త.. జ్వరం వచ్చినపుడు వీటికి దూరంగా ఉండండి..
బాగా కారంగా, మసాలాలు దట్టించిన ఆహారాల జోలికి వెళ్లకండి. ఇవి మీ జీర్ణ వ్యవస్థను మరింత ఇబ్బంది పెడతాయి.
పాస్ట్‌ఫుడ్, స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకుంటే మీరు జ్వరం నుంచి త్వరగా కోలుకోలేరు. ఇవి అనారోగ్యకర కొవ్వులు, అధిక ఉప్పును కలిగి ఉంటాయి.
అధిక కొవ్వు కలిగి ఉండే వేయించిన పదార్థాలను తీసుకోకండి. ఇవి మీ జీర్ణాశయంపై మరింత భారం పెంచి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
శుద్ధి చేసిన చక్కెర కలిగిన పదార్థాలు, కూల్ డ్రింక్స్ మీ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి అవి తీసుకుంటే మీ జ్వరం తగ్గదు.
టమాటాలు, పుల్లటి పండ్లు కూడా జ్వరంతో ఉన్న వారు తినకపోడమే ఉత్తమం. ఇవి ఉదర సంబంధ సమస్యలు కలిగిస్తాయి.
పెరుగు, ఛీజ్ వంటి కొన్ని పాల ఉత్పత్తులు జలుబు, శ్వాస కోస సమస్యలను కలిగిస్తాయి. జ్వరం నుంచి కోలుకుంటున్నారు వీటికి దూరంగా ఉండాలి.
ఆల్కహాల్ శరీరాన్ని డీ-హైడ్రేట్ చేస్తుంది. ఇది జ్వరం నుంచి రికవరీ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
కాఫీ, టీ వంటి కెఫిన్ ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం కూడా జ్వరంతో ఉన్న వారికి మంచిది కాదు.
Related Web Stories
బెల్లీ ఫ్యాట్ పోవడానికి సింపుల్ చిట్కాలు..
ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!
టీతో అనారోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా..?
ఈ సలాడ్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?