యోగా నేర్చుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

మొదట్లో సులభమైన యోగాసనాలు వేయాలి. అనుభవం వచ్చాక క్లిష్టమైన ఆసనాలను ప్రయత్నించాలి

వదులైన దుస్తులు ధరించాలి. దీంతో, యోగాసనాలు వేయడం సులువవుతుంది

నిశ్శబ్దమైన, ప్రశాంతమైన ప్రదేశంలో యోగాసనాలు వేయాలి. దీంతో ఏకాగ్రత కుదురుతుంది

మ్యాట్‌పై యోగాసనాలు వేస్తే కాళ్లు చేతులు జారకుండా ఉంటాయి.

తొలుత బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేశాక యోగా మొదలెడితే ఎక్కువ సేపు ఏకాగ్రత నిలిచి ఉంటుంది

గాయాలు కాకుండా ఉండేందుకు యోగాసనాల వేసేటప్పుడు ఎలైన్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి

తొందరపాటు లేకుండా ఒక్కో ఆసనాన్ని తగినంత సమయం పాటు వేస్తే పూర్తిస్థాయి ప్రయోజనాలు కలుగుతాయి