బీర్‌తో జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక మంది చెబుతారు.

ఇది శాస్త్రీయంగా పూర్తిస్థాయిలో రుజువు కాకపోయినా బీర్‌లో జుట్టుకు మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. 

బీర్‌లోని బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్‌ జుట్టు ఎదుగుదలకు అవసరం

బీర్‌లోని హాప్స్, మాల్ట్ అనే ప్రొటీన్లు వెంట్రుకలను బలోపేతం చేస్తాయి

బీర్‌లోని యాంటీఆక్సిడెంట్ గుణాల నెత్తిపై చర్మాన్ని ఉత్తేజితం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

ఇందులోని ప్రొటీన్లు, చక్కెరలు వెంట్రుకలపై దట్టమైన పొరగా ఏర్పడి జుట్టుకు నిండుదనాన్ని ఇస్తాయి

జుట్టుపై తేమ నిలిచి ఉండేలా చేసి వెంట్రుకలు నిగనిగలాడేలా చేస్తుంది

బీర్ ఆధారిత షాంపూలు, లోషన్లతో జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.