కొబ్బరితో పిల్లలకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు

కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు పిల్లల మెదడు సామార్థ్యాలు మెరుగుపరుస్తాయి.

ఇందులో ఉండే లారిక్ యాసిడ్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

కొబ్బరి నీరులో ఉండే లవణాలు ఎలక్ట్రోలైట్ సమతౌల్యాన్ని పునరుద్ధరిస్తాయి. డీహైడ్రేషన్ దరిచేరదు

ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పేగుల్లో కదలికలను పెంచి మలబద్ధకం నుంచి విముక్తినిస్తుంది.

కొబ్బరిలోని కాల్షియం, పొటాషియం చిన్నారుల ఎముకలను బలోపేతం చేస్తాయి

దీనితో పిల్లల చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది.