మంచి నీళ్లతో ఎన్నో ఉపయోగాలు! కానీ గోరు వెచ్చని నీటితో పలు అదనపు ఉపయోగాలు కూడా ఉన్నాయి

గోరువెచ్చని నీటితో అరుగుదల మరింత మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థ పని ఈజీగా జరిగిపోతుంది.

బరువు తగ్గడంలో గోరువెచ్చని నీరు ఎంతో కీలకం. ఇది జీవక్రియల వేగం పెంచుతుంది. ఫలితంగా కేలొరీలు అధికంగా ఖర్చవుతాయి

గోరువెచ్చని నీటితో శరీరానికి తగినంత తేమ అందుతుంది. దీంతో, రక్తప్రసరణ, ఇతర జీవక్రియలు మెరుగై ఆరోగ్యం చేకూరుతుంది

ఈ నీటితో గొంతు గరగర, ఇతర సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. 

జలుబు చేసినప్పుడు ఆవిరి పడితే త్వరగా ముక్క క్లియర్ అని రిలీఫ్ వస్తుంది

కండరాలను రిలాక్స్ చేయడంలో గోరువెచ్చని నీటికి మించింది లేదు. దీంతో, కండరాల నొప్పులు, స్టిఫ్‌నెస్ వంటివి క్షణాల్లో పోతాయి

గోరువెచ్చని నీటితో శరీరంలోని విషతుల్యాలు చెమట రూపంలో బయటకు పోతాయి. దేహం సులభంగా డీటాక్సిఫై అవుతుంది

వేడినీటితో స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనసుకు ఉల్లాసం చేకూరుతుంది.