రాగి పాత్రల్లో నీరు తాగడం మంచిదని చాలా మందికి తెలిసిందే. మరి వీటి వినియోగంతో కలిగే పూర్తి ప్రయోజనాలు ఏవంటే..
రాగి పాత్రల్లోని నీరు తాగితే జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అవుతాయి. ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది.
రాగిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా సూక్ష్మక్రిములకు చెక్ పడుతుంది.
రాగి పాత్రలో నీరు సహజసిద్ధంగా చల్లబడుతుంది. మంచి రుచిగా కూడా ఉంటుంది.
కాపర్‌లోని యాంటీఇన్‌ఫ్లమేషన్ లక్షణాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
రాగి పాత్రలకుండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల శరీరంపై ఫ్రీరాడికల్స్ ప్రభావం తగ్గి వృద్ధాప్య ఛాయలు తొలగుతాయి
న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీకీ కాపర్ కీలకం కాబట్టి రాగి పాత్రలోని నీరు మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది
థయిరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని కాపర్ నియంత్రించి ఈ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది
రాగి పాత్రల్లోని నీరు జీవక్రియలను వేగవంతం చేసి బరువు నియంత్రణకు తోడ్పాటునందిస్తుంది
Related Web Stories
ఈ ఆహారాలు తీసుకుంటున్నారా.. అయితే మీ కాలేయం సేఫ్గా ఉన్నట్లే..
ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి..?
పొట్ట ఆరోగ్యానికి 10 పోషకమైన ఆహారాలు..
ఈ పదార్థాలు తింటే త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుందట..!