రోజూ ఒక అరటిపండు తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
అరటితో విటమిన్ సీ, బీ6, పొటాషియం, పీచు పదార్థంతో పాటు అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి
అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. దీంతో బీపీపై నియంత్రణ పెరిగి హృద్రోగాలు దరిచేరవు
ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం దరిచేరనివ్వదు.
అరటిలో ఫ్రక్టోస్, గ్లూకోస్, సుక్రోస్ వంటి చక్కెరలు ఉంటాయి. కసరత్తు తరువాత ఇది తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
అరటిలో ఉండే ట్రిఫ్టోఫాన్ అమైనోయాసిడ్ శరీరంలో సెరటోనిన్‌గా మారుతుంది. ఇది మూడ్‌ను మెరుగుపరుస్తుంది.
అరటిలోని పొటాషియం కిడ్నీలకు మేలు చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
ఇందులోని పీచుపదార్థం కారణంగా త్వరగా ఆకలేయదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
అరటిలోని మెగ్నీషియం ఎముకలు ద్రుఢంగా మారేలా చేస్తోంది.
అరటిలోని యాంటీఆక్సిడెంట్స్ కారణంగా చర్మం నిగారింపు సంతరించుకుని యవ్వనకాంతితో తొణికిసలాడుతుంది.
Related Web Stories
బొప్పాయి విత్తనాలు తినడం వల్ల కలిగే 5 లాభాలివే..
మునగాకు పొడితే ఈ వ్యాధులకు చెక్
ఈ చిట్కాలతో నోటి ఆరోగ్యం మీ సొంతం..
కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే ప్రమాదమే..