జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు రాగులు, సజ్జలు, సామలు వంటి చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం

చిరుధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు ఇవి తోడ్పాటునందిస్తాయి

ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.

చిరుధాన్యాల్లో ఉండే ఫైబర్‌‌తో కడుపునిండుగా ఉన్నట్టు అనిపించి ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు

వీటిల్లో గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, గ్లూటెన్ ఇన్‌టాలరెన్స్, సిలియాక్ డిజీస్ ఉన్న వారికి ఇవి ఉపయుక్తం

చిరుధాన్యాల్లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి

వీటిల్లో అధికంగా ఉండే నీరు శరీరంలోని లవణాల సమతౌల్యాన్ని కాపాడుతుంది

గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చచే అనేక రకాల మంచి కొవ్వులు చిరుధాన్యాల్లో ఉంటాయి.

కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటివి అధికంగా ఉండే చిరుధాన్యాలతో ఎముకల దృఢత్వం పెరుగుతుంది

వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో షుగర్ త్వరిత గతిన నియంత్రణలోకి వస్తుంది.