రోజూ పాలకూర తినే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు

పాలకూరలోని విటమిన్ ఏ, సీలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

ఇందులోని ఐరన్ శరీరానికి సమృద్ధిగా ఆక్సీజన్ దక్కేలా చేస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు

పాలకూరలోని ల్యూటీన్, జియాజాంథీన్ అనే యాంటీఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి

ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థకూ మేలు కలుగుతుంది

పాలకూరలోని యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి చర్మం యవ్వన కాంతులీనేలా చేస్తాయి

ఇందులోని విటమిన్ కే కారణంగా ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి

పాలకూరలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి బీపీ కూడా అదుపులో ఉంటుంది

ఇందులోని మెగ్నీషియం కారణంగా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది

పాలకూరలో కెలొరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తింటే సులభంగా బరువు తగ్గుతారు