యోగాసనాల్లో రాజు వంటిది శీర్షాసనం. దీంతో, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఈ ఆసనంతో మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతమవుతుంది

మెదడుకు రక్తప్రసరణ పెరిగి మనసుకు ఉల్లాసం కూడా కలుగుతుంది

వరుసుగా రెండు రోజులు శీర్షాసనం వేయగానే మార్పులు మొదలవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.

శీర్షాసనంతో జీర్ణాశయం కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఉదయాన్నే వచ్చే ఉదర సంబంధిత సమస్యలు మాయమవుతాయి

ఈ ఆసనంతో మైగ్రేన్‌కు కూడా చెక్ చెప్పొచ్చు

శీర్షాసనంతో మెదడుకు చేరే అదనపు రక్తంతో టెన్షన్ తగ్గి మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మెదడులోని పిట్యూటరీ, పీనియల్ గ్రంధుల పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా హార్మోన్ల సమతౌల్యం ఏర్పడుతుంది.

ఈ ఆసనంతో నడుము పైభాగమంతా ద్రుఢంగా మారుతుంది.

శీర్షాసనంతో మెదుడుకు కొత్త శక్తి అందుతుంది. ఫలితంగా ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతత కలుగుతాయి.