మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారా...  ఇవి గుర్తుంచుకోండి

గతంలో గాయాలు, నొప్పి ఉన్నవారు, మోకాళ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కునేవారు వాకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వాకింగ్ ను నెమ్మదిగా మొదలుపెట్టాలి. ముఖ్యంగా వార్మప్ తో వాకింగ్ ప్రారంభించాలి. చివరికి కూల్ డౌన్ చేస్తూ వాకింగ్ ముగించాలి.

వాకింగ్ చేయడానికి కుషనింగ్ ఉన్న తేలికపాటి షూస్ ధరించాలి. ఎల్లప్పుడూ నాణ్యతతో కూడిన షూస్ ఎంపికచేసుకోవాలి. 

గతంలో కాళ్లకు గాయాలు అయినట్టయితే 10కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దూరం నడవడం మానుకోవాలి. ఎప్పుడూ తక్కువ దూరంతో వాకింగ్ ను మొదలుపెట్టాలి.

మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి ఎత్తైన ప్రదేశాలు ఎక్కాలి. కీళ్ల మధ్యన గుజ్జు ఉత్పత్తి బాగా ఉండేందుకు అంజీర్, బాదం వంటివి తినాలి.

ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారు.